BHNG: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ రాజాపేటలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.