సత్యసాయి: భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్ర సహాయ మంత్రి లోకనాథన్ మురుగన్ పుట్టపర్తికి విచ్చేశారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రిగా ఉన్న మురుగన్‌కు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవలను వారు స్మరించుకున్నారు.