AP: రాష్ట్రంలో పంటల ధరలు దారుణంగా పతనమయ్యాయని మాజీ CM జగన్ ఆరోపించారు. ‘CM చంద్రబాబు రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదు. రైతులను ఆదుకోవడానికి మనసు రావట్లేదా? డైవర్షన్ కోసమే రైతన్నా-మీకోసం కార్యక్రమం పెట్టారు. 18 నెలల్లో రైతులకు ఏమైనా చేశారా? ప్రయాణాలు, దుబారా ఖర్చులకు కోట్లు తగలేస్తున్నారు. మేము రైతులను పరామర్శించడానికి వెళ్తే కేసులు పెట్టారు’ అని అన్నారు.