KMM: మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి కోరారు. పాలేరు నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు అన్ని రంగాలలో విజయం సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.