TPT: తిరుపతి నగర టీడీపీ మాజీ మహిళా అధ్యక్షురాలు, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు సత్యవతి ఇవాళ ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు. రేపు ఉదయం 10:00 గంటలకు గోవింద ధామం వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు అన్నారు.