W.G: ఇటీవల తణుకులో పుట్టినరోజు వేడుకలు పేరుతో వీరంగం చేసిన యువకుల తల్లిదండ్రులకు ఆదివారం తణుకు సీఐ ఎన్.కొండయ్య కౌన్సెలింగ్ ఇచ్చారు. వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద రద్దీ సమయంలో బాణసంచా కాల్చుతూ వాహనదారులు పాదచారులు, వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు ఆదేశాలతో యువకులపై కేసు నమోదు చేశారు