WGL: నర్సంపేట నియోజకవర్గంలో ఆదివారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ఇందిరా మహిళా శక్తి చీరలు, కల్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.