VZM: హిందీ సేవాసదన్ (అనంతపురం) ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సీబీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వ హిందీ సిలబస్ పై 6 నుండి 12 తరగతుల విద్యార్థులకు హిందీ ప్రతిభా పరీక్షను నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి పరీక్ష డిసెంబర్ 8న, జిల్లాస్థాయి పరీక్ష జనవరి 4న ఉంటుందని జిల్లాశాఖ ప్రతినిధులు ఉమాబాల, ఏలూరు శ్రీనివాసరావు, జోనల్ సెక్రెటరీ శ్రీధర్ తెలిపారు.