GNTR: గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు కమిషనర్ ఛాంబర్లో డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం, అనంతరం మధ్యాహ్నం కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని వెల్లడించారు.