VSP: విశాఖలోని బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర ఉత్సవాలు ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు సత్యంగల తల్లిగా, కల్పవల్లిగా భాసిల్లుతున్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు పంచామృతాభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు.