VSP: గోపాలపట్నం పవర్ ఆఫీస్ పీఠం అయ్యప్ప దీక్షాదారులు ఆదివారం గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు పల్లకితో కాలినడకన పాదయాత్ర నిర్వహించారు. భక్తి గీతాలు ఆలపిస్తూ, భజనలతో సింహాచలం చేరుకున్న దీక్షాదారులు తొలిపావంచా వద్ద శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఇది తమ పీఠం ఆనవాయితీగా వస్తుందని దీక్షాదారుడు బీ.వీ. కృష్ణారెడ్డి తెలిపారు.