కృష్ణా: తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు గ్రామానికి చెందిన బందెల అశోక్ గారు ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడగా శస్త్రచికిత్స చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అశోక్ గృహానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.