ATP: పామిడి శివారులో రాజు అనే వ్యక్తి కుటుంబ కలహాలతో రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడుతూ వారి బంధువులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బంధువులు పామిడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజు అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రదేశాన్ని సాంకేతికత సహాయం గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజును కాపాడిన పోలీసులను పట్టణ ప్రజలు అభినందించారు.