చండీగఢ్‌లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనపై పంజాబ్‌లో వ్యతిరేకత రావడంతో కేంద్రం మంత్రిత్వశాఖ స్పందించింది. రాజ్యాంగ అధికరణ 131 సవరణ బిల్లుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. అందరితో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ బిల్లును రాబోయే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే ప్రణాళిక లేదని స్పష్టం చేసింది.