VSP: కేజీబీవీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర టీచర్స్ సదస్సులో ఉపాధ్యాయినులు ఎదుర్కొంటున్న అన్యాయాలపై నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. 3500 మంది మహిళా ఉపాధ్యాయిలు పనికి తగిన వేతనాలు, MTS, DA-HRA, చైల్డ్ కేర్ లీవ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేజీబీవీలను నిలబెట్టిన టీచర్స్ హక్కులు కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.