PLD: నరసరావుపేట- సత్తెనపల్లి రోడ్డులోని డాక్టర్ కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న 69వ రాష్ట్ర స్థాయి అండర్–17 బాలురు, బాలికల ఫుట్బాల్ పోటీల ఏర్పాట్లను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. అనంతరం అక్కడున్న క్రీడాకారులతో ముచ్చటించి, వారిని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు.