GNTR: మేడికొండూరు మండలంలో ఆదివారం కేంద్ర సహాయక మంత్రి పేమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు. ప్రజా పరిషత్ కార్యాలయంలో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని అభివృద్ధి పనుల గురించి వివరించారు.