ATP: అనంతపురం రూరల్ మండల సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 29న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో దివాకర్ తెలిపారు. రూరల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో ఉ.11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పక హాజరు కావాలని, అధికారులు తమ ప్రగతి నివేదికలను సమావేశానికి మూడు రోజుల ముందు కార్యాలయంలో అందజేయాలని సూచించారు.