SRPT: మేళ్లచెరువు మండల సర్పంచ్ రిజర్వేషన్ల ప్రాథమిక జాబితా విడుదలైంది. హేమ్లా తండా, జగ్గు తండా ST మహిళలకు, దుబ్బ తండా, రామాంజనేయ తండా ST జనరల్‌కు కేటాయించారు. రామాపురం SC మహిళ, వేపల మాధవరం SC జనరల్‌గా నిర్ణయించారు. రేవూరు, నల్లబండగూడెం BC జనరల్, వెల్లటూరు BC మహిళగా ఖరారయ్యాయి. మేళ్లచెరువు, కందిబండ సహా పలు గ్రామాలు జనరల్ మహిళకు కేటాయించారు.