సిరిసిల్ల సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా కే. నాగేంద్ర చారి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న నాగేంద్ర చారిని సిరిసిల్లకు బదిలీ చేశారు. నాగేంద్ర చారి గతంలో వేములవాడ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు.