PPM: రైతు కుటుంబాల సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ‘అన్నదాత’ కార్యక్రమం కింద సమగ్ర సర్వే నిర్వహణకు సంబంధిత శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారని కలెక్టర్ డా.ప్రభాకరరెడ్డి తెలిపారు. రైతులకు మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం, వారి అవసరాలు తెలుసుకోవడం ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందించడం దీని ముఖ్య ఉద్దేశమన్నారు.