GNTR: బల్గేరియాలోని అసినోవ్ గ్రాడ్ నగరంలో బల్గేరియన్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సారథ్యంతో ఈ నెల 22న నిర్వహించిన ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంటులో భారత్కు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ ధూళిపాళ్ల బాలచంద్ర ప్రసాద్ సత్తా చాటాడు. 9 రౌండ్లకు గాను 7.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలచి ఆదివారం బల్గేరియన్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకొన్నాడు.