GNTR: వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో 61వ శ్రీరామనామ సప్తాహ మహోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. రెండవ రోజైన ఆదివారం బిందెతీర్థం, ఆకుపూజ, విష్ణుసహస్ర నామార్చన పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. విద్యుత్ కాంతులతో ఆలయాన్ని ముస్తాబు చేశామని, ఈనెల 28 వరకు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు.