VZM: బాబా సేవ భావం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం బొండపల్లి మండలం కొవ్వాడపేట గ్రామంలో సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాబా శత జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన ప్రాణం పది మందికి ఉపయోగపడేలా జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు, బొడ్డు రాము పాల్గొన్నారు.