ప్రకాశం: రాచర్ల మండలంలోని ఆకవీడులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టిబాబు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. చిట్టిబాబు పొలంలో మొక్కజొన్న పైరుకు నీరు పట్టే క్రమంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. అయితే ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది