ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని 17వ వార్డులో ఆరు సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆదివారం నూతన మంచినీటి పైప్‌లైన్‌ను ప్రారంభించారు. నూతన బోరు, పైప్ లైన్ ఏర్పాటు చేసి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల నీటి సమస్య తీరుతుందని ఎమ్మెల్యే తెలిపారు.