MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని సహాయక ప్రాజెక్టు మేనేజర్ తిరుపతయ్య ఆదివారం తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. మహిళలు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.