కోనసీమ: కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం నిమిత్తం ఆలమూరు గ్రామానికి చెందిన వెత్సా శ్రీ రామకృష్ణమూర్తి దంపతులు రూ.1 లక్ష విరాళాన్ని అందజేశారు. ఆదివారం ఈ మొత్తాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. సిబ్బందికి ఈ విరాళాన్ని అందించినట్లు వారు తెలిపారు. ఆలయ అధికారులు దాతలకు స్వామివారి చిత్రపటాన్ని అందించారు.