ADB: రైతుని దుర్భాషలాడిన అగ్రికల్చరల్ సెక్రెటరీపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ టూ టౌన్ CI నాగరాజు ఆదివారం తెలియజేశారు. శుక్రవారం రాత్రి మార్కెట్ యార్డులో సెక్రెటరీ జైనథ్కు చెందిన సండే మహేష్ అనే రైతుని మద్యం సేవించి దుర్భాషలాడగా గొడవకు దారి తీసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేయగా మద్యం సేవించినట్లు తెలిసిందన్నారు.