MNCL: మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో సింగరేణి సీనియర్ క్రీడాకారుల స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ను మంచిర్యాల నూతన DCC అధ్యక్షులు రఘునాథ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. క్రీడాకారులు, మ్యాచ్ నిర్వాహకులు స్వతహాగా ఫుట్ బాల్ క్రీడాకారుడైన రఘునాథరెడ్డిని DCCగా నియమించిన సందర్భంగా ఘనంగా సన్మానించారు.