ATP: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని అర్బన్ సీఐ జయ నాయక్ హెచ్చరించారు. రాయదుర్గం పట్టణంలో ఆదివారం అయిన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశాలతో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే బైక్ను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.