WGL: అదాలత్లోని అస్సుంత భవన్లో ఏర్పాటు చేసిన అశోక చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. సమాజంలో ఆశ్రయాన్ని కోల్పోయిన చిన్నారులకు విద్య, రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రజా సమాజానికి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కేంద్రంలోని చిన్నారులకు అవసరమైన సహాయం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు.