MHBD: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలో అధికారులు అవకతవకలు చేసి రైతులకు అన్యాయం చేస్తే సహించేదిలేదని తెలంగాణ రైతుసంఘం జిల్లాకార్యదర్శి శెట్టి వెంకన్న అన్నారు. ఇవాళ తొర్రూరు మండలంలోని పలు గ్రామాలలో గల రైతు కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కనుగోలు కేంద్రాలపై ఏఈవోల పర్యవేక్షణ కోరబడిందని, జరుగుతున్న అవకతవకలపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.