KNR: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాలలో భాగంగా సైదాపూర్ మండలం వెన్నంపల్లి, ఆరెపల్లి, లస్మన్నపల్లి గ్రామాల్లో ఆదివారం ‘ఇంటింటికి జన జాగరణ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సేవకులు ప్రతి ఇంటిని సందర్శిస్తూ స్టిక్కర్లు అతికించారు. ప్రజలకు ‘పంచ పరివర్తన’ కరపత్రాలు అందజేశారు.