W.G: ఆకివీడు దొరగారి చెరువు తవ్వకం పనులను ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆదివారం పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువును లోతుగా తవ్వి, మట్టిని తరలిస్తుండటంపై ఆయన కాంట్రాక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు అభివృద్ధి కోసమే తప్ప.. మట్టి అమ్ముకోవడానికి కాంట్రాక్టు ఇవ్వలేదని మండిపడ్డారు. పనులు సక్రమంగా జరగకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.