సత్యసాయి: సత్యసాయి శత జయంతిని పురస్కరించుకుని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. చిత్రావతి బ్రిడ్జి వద్ద ప్రయాణీకుల సౌకర్యార్థం నిర్మించిన పల్లె ఉమా బస్సు షెల్టర్‌ను, ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మించిన సాయి గోకులం పబ్లిక్ పార్కును ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.