ప్రకాశం: రాష్ట్ర స్థాయి 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ హ్యాండ్ బాల్ పోటీలను ఒంగోలులో ఆదివారం మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆటలు మానసిక ఆరోగ్యానికి శారీరక దృఢత్వానికి తోడ్పడతాయని అన్నారు. గెలుపోటములను స్నేహపూర్వకంగా తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉగ్ర, దామచర్ల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.