కడప: ప్రభుత్వం మహిళల రక్షణ కోసం శక్తి యాప్ సేవలను ప్రవేశపెట్టిందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని భరోసాగా జీవించాలని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం శక్తి యాప్‌కు సంబంధించిన పోస్టర్లను సీఐ రమణారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు ప్రతి ఒక్కరూ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.