NLR: కోవూరు మండలం ఇనమడుగు PHCలో కొత్తగా నిర్మించనున్న భవన నిర్మాణానికి MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా కోవూరుకు త్వరలో 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేయిస్తానని తెలిపారు.