MNCL: జైపూర్ మండలం వేలాల శ్రీ గట్టు మల్లన్న స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న అర్జిత సేవల టిక్కెట్ల రుసుములను పెంచనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి (EO) రమేష్ ఆదివారం ప్రకటనలోతెలిపారు. రుసుము పెంపుదలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, 15 రోజుల లోపు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.