HNK: రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరమైన సమస్యలపై దృష్టిని సారించి పేద ప్రజలకు తగు న్యాయం జరిగేలా చూడాలని సీపీఎం పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి చుక్కయ్య డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం మండల ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలతో చర్చించారు.