NZB: ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పొన్న సంజన(15) విద్యార్థిని గతేడాది ముప్కాల్ జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసింది. 565 మార్కులతో బాసర ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించి విద్యను అభ్యసిస్తుంది. కానీ అనారోగ్య కారణంతో ఆదివారం రోజు మధ్యాహ్నం కళాశాలలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, ఉన్నత పాఠశాల అధ్యాపకులు తెలిపారు.