KMM: పెనుబల్లి మండలం పాత కారాయి గూడెం గ్రామంలో ఆదివారం చెన్నమ్మ, వెంకటేశ్వరరావులా నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పేదవారి సొంతింటి కల నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.