ఇజ్రాయెల్-హమాస్ తరహాలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని US అధ్యక్షుడు ట్రంప్ ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో US సిద్ధం చేసిన 28 సూత్రాల శాంతి ప్రణాళికపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రణాళికను రష్యా డిమాండ్ల మేరకే తయారు చేశారని, ఇది US ప్రతిపాదన కాదని విదేశాంగమంత్రి మార్కో రూబియో తమకు రహస్యంగా చెప్పారని US సెనెటర్లు వెల్లడించారు.