GNTR: తెనాలిలో ఆదివారం రాష్ట్రస్థాయి త్రోబాల్ జట్ల ఎంపిక నిర్వహించారు. వీరు జనవరి 1, 2, 3 తేదీలలో మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సెలెక్షన్స్ను రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, వివేక సెంట్రల్ స్కూల్ పర్యవేక్షించగా, మొత్తం 30 మంది మహిళలు, 25 మంది పురుషులు హాజరయ్యారు.