కోనసీమ: రేపు(సోమవారం) కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో అలాగే ఆర్డీవో కార్యాలయాలు, మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు అర్జీలు సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.