KKD: పిఠాపురంలోని పాడా (PADA) కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు పీడీ చైత్ర వర్షిణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు నేరుగా, ఆన్లైన్ ద్వారా కూడా తమ సమస్యలను నివేదించవచ్చని సూచించారు. అధికారులందరూ అందుబాటులో ఉంటారన్నారు