ADB: లాటరీ పద్ధతి విధానంతోనే సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని జడ్పీ సమావేశ మందిరంలో అధికారుల సమక్షంలో కొనసాగిన రిజర్వేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, డీపీవో రమేష్, DLPO ఫణీందర్, ఎంపీడీవోలు ఉన్నారు.