NLR: మర్రిపాడు మండలం బూదవాడ సమీపంలో 565 జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యక్తి వివరాలు తెలిస్తే మర్రిపాడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని SI శ్రీనివాసరావు కోరారు.