NLG: అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకాంక్షించారు. చిట్యాల మండలం ఉరుమడ్ల, వెంబావి గ్రామాల సరిహద్దు (బోడ గుట్ట) ప్రాంతంలో శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.